ఐసీడీఎస్ సూపర్ వైజర్స్
: ఐసీడీఎస్ సూపర్ వైజర్స్”
సత్తుపల్లి,ఆర్ సి, జూలై30(తెలుగుగళం) న్యూస్: మోసపూరిత మాటలు,ఆపరిచిత వ్యక్తులను నమ్మి బాలికలు దగాకు గురి కావద్దని సత్తుపల్లి మండల ఐసీడీఎస్ సూపర్ వైజర్స్ మహాలక్ష్మి,రజిని,సుజాత,రమాదేవి లు సూచించారు.
గురువారం సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు,మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 కు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112 కు,పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100 కు,సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు టోల్ ఫ్రీ నంబర్స్ కు కాల్ చేసి ఘోరాలపై సమాచారం ఇవ్వాలన్నారు.కరాటే లాంటి విలువిద్య నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో: పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేగల్ల చిట్టికుమారి, ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్స్ అరుణ,రమాదేవి,తామారు తదితరులు పాల్గొన్నారు.