అయినవోలులో 1999-2000 బ్యాచ్ గెట్ టుగెదర్
ఈ69న్యూస్:హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1999-2000 విద్యా సంవత్సరం లో చదువుకున్న విద్యార్థులు ఇటీవల గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ,మిత్రులతో మళ్లీ కలసి ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా వారు అప్పటి గురువులను స్మరించుకుని,తమ విద్యా జీవనంలో వారి పాత్రను గుర్తుచేసుకున్నారు.సంగీత కార్యక్రమాలు,ఆటపాటలు,పాఠశాల జ్ఞాపకాలు పంచుకునే సదస్సు వంటి విభిన్న కార్యక్రమాలతో గెట్ టుగెదర్ ఉల్లాసంగా కొనసాగింది.