ఆటో డ్రైవర్లకు నష్టపరిహారం వెంటనే అమలు చేయాలి
హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్ చౌరస్తా వద్ద నూతన ఆటో స్టాండ్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ నాయకులు రాపర్తి అశోక్,ఎండి.అసిఫ్లు పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి,రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదని వారు విమర్శించారు.ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్ల గిరాకీ తీవ్రంగా తగ్గడానికి ప్రధాన కారణమైన రాపిడో బైక్స్ను నిషేధించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ,ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు ఇంటి అద్దెలు,పిల్లల చదువు ఫీజులు చెల్లించలేని స్థితిలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని,ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి,నష్టపరిహారం వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని,వాటికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.నూతనంగా ఏర్పాటైన ఆటో స్టాండ్ కమిటీ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.రహమత్ నగర్ ఆటో స్టాండ్ నూతన కమిటీ వివరాలు:అధ్యక్షుడు:మొయిన్,ఉపాధ్యక్షుడు:అన్వర్
కార్యదర్శులు:ఇక్బాల్,నజీర్,ట్రెజరర్:తాహిర్
,వర్కింగ్ కమిటీ సభ్యులు:గౌస్ ఆజామ్,షరీఫ్,ఫిరోజ్,జహంగీర్,ఇబ్రహం.