సమస్యల పరిష్కారం కోసం సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి కి కృతజ్ఞతలు
డీఈఓ కేడర్ వెంటనే ఇవ్వాలని డిమాండ్!
సమస్యల పరిష్కారం కోసం సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి కి కృతజ్ఞతలు!
_&_
సిఐటియు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కు అనుబంధంగా ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ మిత్రాల యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది .యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ఆరోగ్య మిత్రాల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంగా యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు సమీక్ష చేయడం జరిగింది .ముఖ్యంగా గతంలో సమ్మె సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము హామీ ఇచ్చిన విధంగా ఆరోగ్యమిత్రాల యొక్క కేడర్‌ను మారుస్తూ వేతనాన్ని 19500/హామీని అమలు చేయడం కొరకు చేసిన కృషిని చర్చించుకోవడం జరిగింది .రాష్ట్ర అరకు శాఖ మంత్రిగారు ,సెక్రటరీ హెల్త్ ఈ ఫైల్ ని ఆమోదించారు. ఫైనాన్స్ సెక్రటరీ ఆమోదిస్తే సీఈఓ ద్వారా జీవో రావాల్సిన అవసరం ఉంది .దాని కోసం కృషి చేయాలని సమావేశంలో తీర్మానం చేసుకున్నారు .అలాగే యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన పోరాట ఫలితంగా గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆరోగ్యశ్రీ విభాగంలోని మిత్రులకు అందరికీ ఎనిమిది గంటల పని దినంఅమలు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సమానంగా సెలవులు అమలు చేస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది .అలాగే ఇంక్రిమెంటు కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది.ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా హెల్త్ కార్డులు ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో కృషి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ ప్రసంగిస్తూ ఆరోగ్య మిత్రల ఐక్యమత్యం వల్ల ఈరోజు రెండు సమస్యలు పరిష్కారం అయ్యాయి. రాబోయే కాలంలో క్యాడర్ కోసం వేతనాల పెంపూ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు .ఆరోగ్యశాఖ మంత్రి గారి యొక్క సహకారంతోనే ఇప్పటిదాకా కొన్ని సమస్యలు పరిష్కారమైన వి.భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సానుకూలంగా పరిష్కారం చేస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఒకవేళ అలాంటి జరగని పక్షంలో ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది .ఆరోగ్య శ్రీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య మాట్లాడుతూ యూనియన్ ఐక్యంగా ఉండాలని యూనియన్ సభ్యత్వం చేరాలని రాబోయే కాలంలో ఈ మన సమస్యల పరిష్కారం కోసం సీటు ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ తో పాటు రాష్ట్ర నాయకులుగా ఉన్న సుమన్ హైదరాబాద్ అధ్యక్షులు రాజు ,నాగరాజు ,రవీందర్ కిషోర్, లిల్లీ పుష్ప ,వజ్ర, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.