ఆస్పత్రిలో బాధితులకు ధైర్యం చెప్పిన మాజీ జిల్లా పరిషత్ సభ్యులు
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలానికి చెందిన మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు మేడిశెట్టి రాములు వరంగల్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వ్యాధి బాధితులను పరామర్శించారు.
ములుగు రహదారి సమీపంలోని రెనో ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్ గ్రామ మాజీ సర్పంచ్ చెడుపాక ప్రభాకర్, చెడుపాక దర్గయ్యను ఆయన కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం కాళోజీ కళాక్షేత్రం సమీపంలోని ఓజెస్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న రెడ్లవాడ గ్రామానికి చెందిన బాల్య మిత్రులు,గ్రామీణ వైద్యులు ఖలీలుల్ రెహమాన్ ను పరామర్శించారు.వైద్యుల సూచనల మేరకు మందులు వాడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆస్పత్రిలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.