చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పించే వేదిక సంత
- రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు పరిశుభ్రత పాటించాలి
- ప్రజల ఆరోగ్యం ముందే, లాభం తర్వాతే…
- ప్రమాణాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
- వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ పూదరి శ్యామ్ కుమార్
- పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని, అలాగే తోపుడుబండ్లపై టిఫిన్ సెంటర్లు నడిపే వారు కూడా తగిన పరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ పూదరి శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఆహార విషబాధలు, గడువు ముగిసిన సరుకుల వినియోగం, అపరిశుభ్ర వంటశాలలు, పాత నూనెల వినియోగం వంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
- ప్రజలు తమ కష్టార్జిత ధనంతో కొనుగోలు చేసే ఆహారం సురక్షితంగా, పరిశుభ్రంగా ఉండటం వారి హక్కు అని పేర్కొన్న ఆయన, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్గదర్శకాలను ప్రతి హోటల్ యాజమాన్యం కచ్చితంగా పాటించాలని అన్నారు. వంటగదుల్లో పరిశుభ్రత, శుభ్రమైన తాగునీటి వినియోగం, ముడి సరుకుల నిల్వ విధానం, సిబ్బంది ఆరోగ్య పరీక్షలు, వంట పాత్రల శుభ్రత వంటి అంశాల్లో నిర్లక్ష్యం అస్సలు సహించబోమన్నారు. మెనూ కార్డుల్లో ధరలు స్పష్టంగా ప్రదర్శించడం, బిల్లులు ఇవ్వడం, పన్నుల వివరాలు పారదర్శకంగా చూపించడం కూడా వినియోగదారుల హక్కులలో భాగమేనని పేర్కొన్నారు.
- అదేవిధంగా రోడ్ల పక్కన తోపుడుబండ్లపై టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు కూడా సమాన బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఆహారాన్ని కప్పి ఉంచకపోవడం, దుమ్ము, కాలుష్యానికి గురయ్యే ప్రదేశాల్లో వంట చేయడం, పాత నూనెలను పదేపదే వినియోగించడం, చేతులు శుభ్రంగా కడగకపోవడం వంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. శుభ్రమైన నీటి వినియోగం, డస్ట్బిన్ల ఏర్పాటు, సిబ్బంది గ్లవ్స్, క్యాప్‌లు ధరించడం వంటి ప్రాథమిక పరిశుభ్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు.
- జిల్లా ఆహార భద్రతాధికారులు, స్థానిక సంస్థలు తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి నాణ్యత లేని ఆహారం అందించిన సందర్భాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం సమాజానికి అమూల్యమైన సంపద అని, లాభాపేక్ష కంటే మానవ ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పూదరి శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు.