
ఈ69న్యూస్ వరంగల్,జూలై 9:ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఐదుగురు బాధితులకు తిరిగి వారి ఫోన్లు అందజేయడంలో పోలీసులు సఫలమయ్యారు.ఈ చర్యలో CEIR పోర్టల్‌ను ఉపయోగించి సెల్ ఫోన్లను ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ ఎం.ఏ.షుఖూర్,ఎస్ఐ రోహిత్ ఐట్టి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారు.ఆన్లైన్ రైటర్ సందీప్,క్రైం కానిస్టేబుల్ దీపక్‌లు ఈ వ్యవహారంలో ట్రేసింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.బాధితులకు వాటిని అప్పజెప్పిన సందర్భంగా ఇన్స్పెక్టర్ MA షుఖూర్ వీరిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలు తమ ఫోన్లు పోయిన వెంటనే CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని,ఇది దొంగతనాలను అరికట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు సూచించారు.