ఇందిరా మహిళా పాల ఉత్పత్తి దారులతో వీడియో కాన్ఫిరెన్స్
మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నిర్వహించిన పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఈసి సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ….కొన్ని వేల మంది భవిష్యత్ డైరీ నిర్వహకులైన మీపై ఆధారపడి ఉందని,ఈ రోజు మీరు పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తి దారుల సంఘానికి బాధ్యులు అన్నారు. ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.21 మంది సభ్యుల పనితీరుపై భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.పాల సేకరణ నుండి పాల అమ్మకం వరకు మహిళలతో నడుస్తుంది అన్నారు. ముల్కనూరు మహిళా డైరీ స్ఫూర్తితో ముందుకెళ్దామని,15వ తేదీన గీసుకొండ మండల కేంద్రంలో సంగెం, గీసుగోండ,15,16,17వ డివిజన్లు,16వ తేదీన పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నడికూడ, పరకాల, ఆత్మకూరు,దామెర మండలాల ప్రాథమిక మహిళా సహకార సభ్యులకు మహిళా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు. పశు పోషణపై ప్రత్యేక దృష్టి సాధించాలని, పశువుల కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామన్నారు.ప్రతి పాల ఉత్పత్తి రైతును ఆదుకోవడం కోసం బ్యాంకు తో లింకేజీ చేస్తామన్నారు.మహిళల అభివృద్ధి,పాల ఉత్పత్తిదారుల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.మహిళలు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుని సమాఖ్యను మరింత విజయవంతంగా నడిపించాలని సూచించారు.పాల ఉత్పత్తిదారుల కోసం అవసరమైన సహాయం,పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.గ్రామీణ స్థాయిలో మహిళలు ఆర్థికంగా ముందుకు సాగడానికి సహకార సంఘాలు ఒక గొప్ప వేదికగా నిలుస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిఆర్ డి ఏ అధికారులు,డిసిఓ, ఏపీఎం లు తదితరులు పాల్గొన్నారు.