ఊపందుకున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లేపల్లి మధు గ్రామంలోని ప్రతి వాడలో, ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. తనకు కేటాయించిన హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.
ఈ సందర్భంగా మధు మీడియాతో మాట్లాడారు.గతంలో తాను ఎంపిటిసిగా ఐనవోలు గ్రామ ప్రజలకు కులమతాలకు,పార్టీలకు అతీతంగా సేవలు అందించానని, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రావడం తనకు గౌరవంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే మరింత శక్తివంతంగా, బాధ్యతతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్యే నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ ల సహకారంతో ఐనవోలు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి మార్గంలో నడిపేందుకు కట్టుబడి ఉన్నానని మధు హామీ ఇచ్చారు.