ఎండోవ్యాస్కర్ టెక్నిక్ ద్వారా వైద్యం
ఖమ్మం యశోద హాస్పిటల్ లో జరిగిన సమావేశంలో ఎంబిబిఎస్ , ఎంఎస్ ( జనరల్ సర్జరీ ) , డి ఎన్ బి (వసక్యూలర్ సర్జరీ ) , కన్సల్టెంట్ వసక్యూలర్ & ఎందువాసక్యూలర్ సర్జన్ ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీ కాంత్ రాజు మాట్లాడుతూ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ నందు పిఏడి సమస్య వచ్చిన వారికి అడ్వాన్స్ టెక్నాలజీ ప్రొసీజర్ తో అత్యాధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో ఓల్డ్ క్లాస్ స్థాయిలో ఎండోవ్యాస్కర్ టెక్నిక్ ద్వారా వైద్యం అందిస్తున్నాం అన్నారు . ఈ ప్రొసీజర్ ను నిడిల్ పంచర్ ద్వారా జస్ట్ వైర్లు పాస్ చేస్తారు ఎక్కడ కూడా ఒక్క కోత కూడా కనబడదు ఎటువంటి మత్తుమందు ఇవ్వకుండా పేషంట్ సృహలో ఉన్నప్పుడే చేస్తారన్నారు . ఆ తర్వాతకి యధా విధంగా అన్ని పనులు చేసుకోవచ్చు అని తెలిపారు . కాళ్లకు సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం చేయడం , దుమ్మపానం , మద్యపానాలకు దూరంగా ఉండటం వల్ల ఆపరేషన్ ద్వారా వచ్చే ఫలితాన్ని ఎక్కువకాలం అనుభవించగలరని పేర్కొన్నారు . యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫో స్ట్రక్చర్ ఉండటం వల్ల ఇప్పటివరకు ప్రతి నెల సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్లను రికవరీ చేసి పంపిస్తున్నామన్నారు . ప్రతి ముగ్గురిలో ఒకరికి షుగరు కంపల్సరిగా ఉంటుందని షుగర్ ఉండే వంద మందిలో 30 మందికి పెరిఫెరల్ అరటీరియల్ డిసైజ్ (పిఏడి) సమస్య ఉంటుందన్నారు . ఈ సమస్య వచ్చిన వారిలో మూడు రకాల సింటమ్స్ చూపిస్తుంది . ఫస్ట్ ది నడిచేటప్పుడు పిక్కలు బాగా పట్టుకుని భరించరని నొప్పితో ఏటువంటి పని చేసుకోలేరు , రెండవది పాదాలలో భరించరాన్ని నొప్పుతో నిద్ర పట్టక మనిషి ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలో ఉంటాడు , మూడవది మానని గాయాలు కాళ్లలో అవడం , కాళ్లలో ఒక భాగం నల్లగా మారడం , కుళ్ళిపోవడం , దుర్వాసన రావడం వంటి లక్షణాలు ఉంటాయి . అలా ఉన్నప్పుడు వెంటనే వాస్కులర్ సర్జన్ డాక్టర్ ను కలిసి సలహా సూచనలు తీసుకోవాలన్నారు . వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకుని అవసరాన్ని బట్టి డాప్లర్ టెస్ట్ , సిటీ యాంజియోగ్రామ్ టెస్టు లు చేపించుకోవడం ద్వారా వ్యాధి తీవ్రత బయటపడుతుందన్నారు . ఈ వ్యాధిని సీరియస్గా తీసుకుని వీళ్ళెంతవరకు చికిత్స చేయించుకోవాలని సూచించారు . ఒకేసారి రెండు కాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు . ఇది ఎక్కువగా తంబాకు , సిగరెటు , మద్యపానం తీసుకునే వారికి మరియు ఉబకాయం ఉన్న వారికి ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నారు . ఇది వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది లేదా కాళ్లు గాని వేలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు . దీనిని లెగ్ ఎటాక్ అంటారని పేర్కొన్నారు . హార్ట్ బైపాస్ సర్జరీ లేదా స్టెంట్ ఎలా వేస్తామో అదేవిధంగా కాళ్లలో బ్లాక్ అయినా రక్తనాళాలకు బైపాస్ సర్జరీ లేదా స్టెంట్ వేస్తారన్నారు . దాన్ని గుర్తించి తగిన వైద్యం అందించి కాళ్లలో తగిన రక్త సరఫరా పెంచడం ద్వారా వారి యొక్క ప్రాణాలు , కాళ్లు , వేళ్ళు కాపాడుకోగలుగుతాం . ఎక్కువ శాతం షుగర్ పేషెంట్ కు కాళ్లకు ఒకచోట పుండు అయి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతుందన్నారు . ఎవరైనా హాట్ కు ఇంపార్టెంట్ ఇస్తారు గానీ కాళ్లకు ఇవ్వలేకపోతున్నారు అని అన్నారు . ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హై టెక్ సిటీ మార్కెటింగ్ మేనేజర్ డి . బాలరాజు , టీం లీడర్ కే . మహేష్ తదితరులు పాల్గొన్నారు .