ఎక్మో ద్వారా వందల కేసులు పరిష్కారం
యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ సీనియర్ డాక్టర్ వై.సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, సాధారణ చికిత్సలు సరిపోని పరిస్థితులలో ప్రాణాలను కాపాడటంలో అధునాతన క్రిటికల్ కేర్ విధానాలలో ఎక్మో ఒకటి, శ్వాసకోశ లేదా గుండె వైఫల్యంతో బాధపడుతున్న పేషేంట్లకు, ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ఎక్మో లాంటి సాంకేతికతలు ప్రాణాలను నిలబెట్టే పరిష్కారాలుగా మారాయి అని, కృత్రిమ గుండె , ఊపిరితిత్తుల లాగా పనిచేస్తూ, ఎక్మో శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. తద్వారా పేషేంట్ శరీరం కోలుకోవడానికి తగిన సమయం లభిస్తుంది. అలాగే, పారాక్వాట్ విషప్రభావం, డ్రగ్ ఓవర్డోస్ వంటి తీవ్రమైన విషప్రభావాల కేసులను నిర్వహించడంలో ప్రత్యేక డయాలసిస్ మరియు ఎక్మో థెరపీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని, అన్నారు. మా సోమాజిగూడ యశోద ఆసుపత్రి అధునాతన క్రిటికల్ కేర్ మౌలిక సదుపాయాలు, ఐసీయూ అవేర్నెస్ వంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక ఇంటెన్సివ్ కేర్ ప్రాణాలను ఎలా కాపాడుతుంది మరియు రోగులు కోలుకోవడంలో ఇది పోషించే కీలక పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు , పరమేశ్, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు .