ఎన్ఎస్ఎస్ విద్యార్థుల శ్రమదానం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ఆవరణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ విద్యార్థులు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్.వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు క్రమశిక్షణతో పాటు సామాజిక సేవ పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.అవసరమైతే దేశ రక్షణలో కూడా సేవలందించే బాధ్యతను యువత స్వీకరించేలా ఇలాంటి కార్యక్రమాలు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.తదనంతరం శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వర్లు,మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ,ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి లావణ్యతో పాటు సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు.