ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలు
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోనే ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చివరి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ కొనసాగుతుందన్నారు.ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీల్లో కూడా ఎన్నికల కోడ్ యథాతథంగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చివరి దశ ఎన్నికల వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు.ఎవ్వరూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించవద్దని,ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామపంచాయతీ ఎన్నికల చివరి దశ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి,ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని,చివరి దశ ఫలితాలు వెలువడే వరకు అదే విధంగా కొనసాగుతుందని తెలిపారు.ఈ నెల 11,14,17 తేదీల్లో జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.