
ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు
జఫర్గడ్ మండలంలో నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావుని కాంగ్రెస్ యువజన నాయకుడు జోగు వినయ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ..పోలీసు వ్యవస్థ ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని,జఫర్గడ్ ప్రాంతంలో చట్టవ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.కొత్త ఎస్ఐ రామారావు నాయకత్వంలో పోలీస్ సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు