
ఈ69న్యూస్ హైదరాబాద్:ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం-2025లోని రోస్టర్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన చర్చా సభలో ఆయన మాట్లాడారు.బత్తుల రాంప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ సమావేశానికి డాక్టర్ మంచాల లింగస్వామి అధ్యక్షత వహించారు.డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ..మాల కులాన్ని గ్రూప్–IIIలో చేర్చి రోస్టర్ పాయింట్ 22 కేటాయించటం వల్ల విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.శాతవాహన యూనివర్సిటీ నోటిఫికేషన్లో,మెడికల్,విద్యుత్ శాఖల నియామకాలలో మాలలకు గణనీయమైన నష్టం జరుగుతున్న ఉదాహరణలు ఇచ్చారు.2011 జనాభా గణన ఆధారంగా వర్గీకరణ చేయడం సహేతుకం కాదని,రోస్టర్ పాయింట్లు సవ్యంగా అమలు చేయకపోవడం ప్రభుత్వ కుట్రని విమర్శించారు.భవిష్యత్తు కార్యాచరణగా గ్రూప్–III రోస్టర్ పాయింట్ 22ను 16కి మార్చే వరకు పోరాటం కొనసాగించేందుకు మాల మహానాడు నిర్ణయం తీసుకుంది.ఆగస్టు 1ను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల బ్లాక్ డేగా ప్రకటించారు.అదే రోజు హైదరాబాద్‌ను అష్ట దిగ్బంధనం చేసి రేవంత్ రెడ్డి సర్కారుకు మాలల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ దృష్టిని మల వైపు తిప్పే వరకూ మహా ధర్నాలు,ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో కోఆర్డినేటర్ ఆవుల సుధీర్,సీనియర్ జర్నలిస్టు ఆస్ శ్రీరాములు,కరణం కిషన్,గోపోజు రమేష్,సుదమల్ల అంజలీ,మైస నాందేవ్,మణిదీప్,రాహుల్ మధునూరి,తదితరులు పాల్గొన్నారు.