
ఈ69న్యూస్ మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఓ గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి ఐస్‌క్రీమ్ ఆటోలు, బండ్లకు ప్రవేశం నిషేధిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరు ఐస్‌క్రీమ్ బండి గ్రామంలోకి తీసుకువస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు.పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.