ఓసీ సింహగర్జన సభకు భారీగా తరలిన ప్రజలు
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ఓసీల సింహగర్జన మహాసభకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరి కొత్తపల్లి మండలాల నుంచి ఓసీ కులాలకు చెందిన ప్రజలు భారీగా తరలివెళ్లారు.రెడ్డి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పత్తి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈ మండలాల నుంచి ఆరు బస్సులు, ఐదు కార్లలో ఓసీ కులాలకు చెందిన ప్రజలు సభకు హాజరయ్యారు. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, మార్వాడి వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓసీ కులాల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు లింగారెడ్డి, రఘోత్తం రెడ్డి,ఏడేళ్లి మోహన్ రెడ్డి,గన్రెడ్డి లింగారెడ్డి,భగవాన్ రెడ్డి,ఇంద్రారెడ్డి, ప్రకాశ్ రెడ్డి,రూపిరెడ్డి విజేందర్ రెడ్డి,పాకాల తిరుపతి రెడ్డి,పెండ్యాల మహేందర్ రెడ్డి,గుజ్జుల రాజిరెడ్డి,కేసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, దూదిపాల లింగారెడ్డి, సంపత్ రెడ్డి,చేరి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి,లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.