కందుకూరు లో మంత్రి,ఎంపీ పర్యటన
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గాక కందుకూరు గ్రామంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి పర్యటించారు.ఇరువురు దృష్టికి ప్రజలు పలు సమస్యలను తెచ్చారు.పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ముందు మంత్రి తుమ్మల తన మిత్రుడు, రాజకీయ విశ్లేషకులు బండి గురునాథరెడ్డి గృహానికి వెళ్లి కొద్దిసేపు మాట మంతి చేశారు. వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించే తుమ్మల,పార్థసారథిరెడ్డి లు వీరు కలసి నడవటంపై సర్వత్ర చర్చ జరుగుతుంది.ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇద్దరు పాల్గొన్నారు.ఎవరు ఎవరి పార్టీలోకి మారుతున్నారు అనే చర్చ ప్రజలలో బలంగా విన వచ్చింది. ఈ కార్యక్రమంలో: తుమ్మల అభిమానులు,కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.