
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆమోదం తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,నాయిని రాజేందర్ రెడ్డి,కె.ఆర్.నాగరాజు,గండ్ర సత్యనారాయణ,ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యలతో కలిసి కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేసి పెద్ద విమానాల రాకపోకలకుగాను మౌలిక వసతులు పూర్తిచేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి,భూసేకరణ అనంతరం రోడ్డు కనెక్టివిటీతోపాటు విమాన రాకపోకలు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.