కేసీఆర్ పాలన రావాలి అని ప్రజలు కోరుతున్నారు: కేటీఆర్
సత్తుపల్లి పట్టణంలోని సిద్ధారంరోడ్డు లో ఎంఆర్ఎఫ్ గార్డెన్లో ఏర్పాటుచేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అవగాహన సదస్సులో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే కేసీఆర్ ఎప్పుడో చెప్పారు.రెండున్నరేళ్ల అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఎవరికి నష్టం జరిగిందో ఆలోచించండి. కాంగ్రెస్ హయాంలో మోసపోని వర్గం లేదు, కుప్పకూలని రంగం లేదు. నియోజకవర్గాల్లో పనిచేసే విలేకరులకు బీఆర్ఎస్ హయాంలో అక్రిడేషన్ కార్డులు ఇచ్చే వాళ్లం. కాంగ్రెస్ హయాంలో వాటి విషయంలోనూ అన్యాయం చేస్తున్నారు. విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలని కోరుతున్నా లేకపోతే హైదరాబాద్ వేదికగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ పక్షాన ఒత్తిడి తీసుకువస్తాం అని, 60 ఏళ్లలో రైతులపై రకరకాల పన్నులు వసూలుచేసిన ప్రభుత్వాలనే చూశాం కానీ, తొలిసారి రైతుకు పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచన చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ 72 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.73 వేల కోట్లు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని,ఇప్పుడున్న ముఖ్యమంత్రి 72 సార్లు ఢిల్లీకి పోయి పైసా తెచ్చింది లేదు. గతంలో ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరిట కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలని ఆనాడు కేసీఆర్ సంకల్పించారు. పదివేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు చేపట్టి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టుతో మొట్టమొదటి ఫలితం అందుకునే నియోజకవర్గం సత్తుపల్లి.ఈ ప్రాజెక్టు కోసం 8 వేల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖర్చుచేసింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినా రెండున్నరేళ్లలో ఏం పట్టించుకోలేదు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటాం.పవర్ ఫుల్ శాఖలన్నీ ఖమ్మంలోని ముగ్గురు మంత్రుల చేతిలోనే ఉన్నాయి. ఈ ముగ్గురు మంత్రులతో ఖమ్మం జిల్లాకు ఒరిగింది శూన్యం. రూ.50 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చివరికి రూ.20 వేల కోట్లకు తెచ్చారు. కేసీఆర్ 11 సార్లు రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం వేశారు. గత రెండున్నరేళ్లలో మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దివానా గాడు ఎవరు. అన్నిరకాల వడ్లకు బోనస్ అని ఎన్నికల్లో మాటిచ్చి చివరికి ఏడు రకాలకు కుదించి దగా చేశారు. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నై కాబట్టే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గన్నీ బ్యాగులు దొరకని దుస్థితి అని,
రాష్ట్రంలో రైతుబంధు పడటం లేదుకానీ ఢిల్లీలో ఠంచన్ గా రాహుల్ బంధు మాత్రం పడుతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.
విద్యార్థులకు రకరకాల హామీలిచ్చిన రేవంత్ రెడ్డి, చివరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా చెల్లించకుండా నయవంచన చేస్తున్నారు. పదివేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి నష్టం ఎవరికి జరుగుతోందో ఒక్కసారి ఆలోచించాలి.
- బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ఈ రెండున్నరేళ్లలో చేసిందేమిటి? గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోమని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? మూడు నెలల్లో అన్నీ చేస్తామన్న మాట మూడేళ్లు కావస్తున్నా ఏమైపోయింది? షాపుల్లో లేని యూరియా.. యాప్ లో ఎక్కడ ఉంటది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ స్థానాలు కట్టబెడితే.. యూరియా యాప్ ను బంగాళాఖాతంలో పడేస్తాం అని, మళ్లీ ఆటో అన్నకు ఫోన్ చేస్తే, పొలం కాడికి యూరియా ఇచ్చి పోయే రోజులు తెస్తాం అని, కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి కనీసం మహిళలను లక్షాధికారులను చేయాలి. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో లక్షా 50 వేలు వేస్తే, శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 60 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. రెవెన్యూ మంత్రి సంపద మాత్రం పెరుగుతోంది. బుగ్గపాడు ఫుడ్ పార్కులో ఏం జరుగుతోందో ప్రజలు గమనించాలి. ఎకరానికి 60 లక్షల మార్కెట్ విలువ ఉన్న భూములను రూ.21 లక్షలకే ఎందుకు రాసిచ్చారు. సీతారామ ప్రాజెక్టు నుంచి వంద కోట్ల మట్టి దోపిడీ చేస్తున్నది వ్యవసాయ మంత్రినే. కాంట్రాక్టుల రూపంలో పొంగులేటి వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. పొంగులేటికి తప్ప ఎవరికైనా కాంట్రాక్టులు వస్తున్నాయా ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని కార్యకర్తలు సీరియస్ గా తీసుకోవాలి. ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఇంటింటికీ వెళ్లి చేపట్టండి డిజిటల్ రూపంలో అత్యంత సులువుగా పార్టీ సభ్య నమోదు చేపట్టేందుకు ప్రత్యేకంగా యాప్ తెచ్చాం. పదేళ్లు తపస్సులా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశాం.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకుంటా. మోడీ ఎంత చెబితే అంతే పంట కొంటామని కాంగ్రెస్ చేతులెత్తేసింది.కాంగ్రెస్ ను త్వరలో కాటికి పంపడమే ఇక మిగిలింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు లింగాల కమల్ రాజు,కూరాకుల నాగేశ్వరరావు,దిండిగాల రాజేందర్, ఏనుగుల రాకేశ్ రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు