కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ ప్రభంజనం
మూడవ దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 24 గ్రామపంచాయతీలకు గాను 17 గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, అందులో 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఒక్క గ్రామపంచాయతీ మాత్రమే దక్కడం గమనార్హం.మండల వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో అధికార పార్టీ స్థానాన్ని మరింత బలపరిచింది. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు చేరువైన నాయకత్వమే ఈ విజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలిచిన గ్రామపంచాయతీలు (పోటీ ద్వారా)
గోవిందాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఇర్ప రణిత,గోపాలపురం గ్రామంలో వట్టం శ్రీనుబాబు,ముస్మి గ్రామంలో బానోతు దేవేందర్,చెరువుముందుతండాలో కుంజ సరిత,పెగడపల్లిలో ఈక సుమలత,
గుంజేడులో తోలెం అనంతరావు,
గుండం గ్రామంలో గట్టి కొమ్మక్క,
ఓటాయిలో గట్టి రాములు,
కొత్తపల్లిలో మల్లెల భాగ్యమ్మ,
తాటివారివేంపల్లిలో తాటి వసంత,
రామన్నగూడెంలో తేజావత్ పార్వతి (దేశ్య),పొగుళ్లపల్లిలో నూనావత్ ఈర్య,
ఎదుళ్లపల్లిలో దనుసరి ముత్తయ్య,
జంగావని గూడెంలో గొంది సోని–రాజు,
కొత్తగూడ గ్రామపంచాయతీలో మల్లెల భాగ్యమ్మ,బత్తులపల్లిలో ఈసం పుష్ప – సురేందర్,వెలుబెల్లి గ్రామంలో వజ్జ అక్షయ వర్మ కాంగ్రెస్ తరఫున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవంగా కాంగ్రెస్ ఖాతాలో చేరిన గ్రామపంచాయతీలు
కార్లయి గ్రామంలో వెనుక సిరివెన్నెల,
కోనాపురంలో కుంజ బిక్షపతి,
సాదిరెడ్డిపల్లిలో ఆలూరి కిరణ్,
ఎంచగూడలో వాసం నరసమ్మ,
మొండ్రాయిగూడెంలో వంక రామయ్య,రేన్య తండాలో మాలోత్ లక్ష్మి – రావోజి నాయక్ ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ గెలుపు
దుర్గారం గ్రామపంచాయతీలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు యాకమ్మ సర్పంచ్‌గా ఎన్నికై పార్టీ ఖాతా తెరిచారు.
మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంబరాలు జరుపుకుంటూ, ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ విజయం ప్రజల ఆశీర్వాదమేనని, రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తామని నూతన సర్పంచ్‌లు తెలిపారు. ఈ ఫలితాలు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని మరోసారి చాటుతున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.