గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి 20 కోట్ల రూ " బడ్జెట్ అందించండిగిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి 20 కోట్ల రూ " బడ్జెట్ అందించండి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ24 June, 2026E69NEWS

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి 20 కోట్ల రూ ” బడ్జెట్ అందించండి

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి 20 కోట్ల రూ " బడ్జెట్ అందించండి

పి ఎచ్ సి సెంటర్ లో మౌలిక వసతులు కల్పించాలి

ఖాళీగా ఉన్న డాక్టర్స్ పోస్ట్ లను భర్తీ చేయాలి

భద్రాచలం ఏరియా హాస్పిటల్ పై దృష్టి పెట్టండి ఆరోగ్య సేవలు అందించడానికి సంబంధిత వైద్య అధికారులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టీ గిరిజనులకు వైద్య సేవలు అందేలా చూడాలని వసతుల గురించి ప్రణాళికలు రూపొందించి తనకు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు, దామోదర రాజనర్సింహ అన్నారు.

హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ భవనం జూబ్లీహిల్స్ లో జరిగిన వర్క్ షాప్ లో ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్థు తో కలిసి జరిగిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలోని కుటుంబాలకు సీజనలను బట్టి వచ్చే వ్యాధులే కాకుండా ప్రాణాంతకమైన క్యాన్సర్ మరియు కిడ్నీ సమస్యలు మరియు ఇతర డిసిజన్ల నుండి గిరిజనులకు అవగాహన కల్పించి సరియైన వైద్య సేవలు అందించడానికి కావలసిన ప్రతిపాదనలు రూపొందించి పంపించాలని అన్నారు. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక అలవెన్స్లతో పాటు వారికి కార్పోరేస్ ఫండ్ అందిస్తామని గిరిజనులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాలని అన్నారు.

ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో గిరిజనులకు సరైన వైద్య సదుపాయాలు అందించడానికి భద్రాచలం ఐటిడిఏ ఏజెన్సీ ఏరియా పరిధిలో డాక్టర్ల కొరత ఉందని, అలాగే పిహెచ్సి ల నిర్మాణం కూడా చేపట్టాలని, పీహెచ్సీలలో వివిధ రకాల ఎక్విప్మెంట్ తో పాటు మౌలిక వసతుల కల్పన కల్పించాలని అన్నారు. వీటికి దాదాపు గా 20 కోట్ల వరకు రూపాయలు అవసరం ఉన్నదని అన్నారు. హా బడ్జెట్ విడుదల చేస్తే ఆదివాసులకు మెరుగైన వైద్య సహాయకారాలు అందించడానికి ముందు ఉంటాం అని, భద్రాచలం ఏరియా హాస్పిటల్ నాలుగు రాష్ట్రాలకు హాస్పిటల్ వైద్య సేవలు అందించడానికి ముందు ఉందని కాబట్టి డాక్టర్స్ నీ భర్తీ చేయాలి అన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *