గీతన్నల రణభేరి పోస్టర్ ఆవిష్కరణ
కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభల సందర్భంగా నవంబర్
28వ తేదీన సూర్యాపేటలో భారీ ప్రదర్శన,బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి జిల్లా నలుమూలల నుండి గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని కల్లుగీత కార్మిక
సంఘం మండల అధ్యక్షులు, కార్యదర్శి ఈరగాని శ్రీనివాస్, మొగుళ్ల యాకన్న పిలుపునిచ్చారు.
ఈరోజు మరిపెడ మండలం లోని గుండెపూడి, తాళ్లకల్, రాంపురం, చిల్లంచర్ల,యల్లంపేట, ఏజర్ల, పురుషోత్తమాయగూడెం, మరిపెడ, ఉల్లేపల్లి,
గాలివారిగూడం, అబ్బాయిపాలెం గ్రామాల్లో
బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ సభ అనంతరం 29,30 తేదీలలో జరిగే ప్రతినిధుల మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
1957లో రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడ్డ సంఘం కల్లుగీత కార్మిక సంఘం. ఈ 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాలు,ఉద్యమాలు నిర్వహించాం. సొసైటీలు, టిఎఫ్ టి లు, పెన్షన్, ఎక్సిగ్రేషియా లాంటి కొన్ని హక్కులు సాధించుకున్నాము. మరెన్నో సాధించుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపే లేదు. కేంద్ర బిజెపి ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ఒక్క పథకం కూడా పెట్టలేదు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అధికారులకు, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా వెంటనే విడుదల చేయాలని, నీరా మరియు తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మండలం సోషల్ మీడియా ఇంచార్జ్ బోడుపట్ల రాజశేఖర్, గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, సొసైటీ సభ్యులు రాంపల్లి బుచ్చి రాములు, దోమల సత్తయ్య, దోమల సోమయ్య, వీరగాని రమేష్,రాంపల్లి చిన్న వెంకన్న, ఈరగాని ఉపేందర్, సుధా గాని సుధాకర్, రాంపల్లి శ్రీను,వీరగాని వెంకన్న,దోమల సతయ్య తదితరులు పాల్గొన్నారు.