
E69 న్యూస్ అయినవోలు
హనుమకొండ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అయినవోలు మండలం వెంకటాపురం గ్రామంలో కాటమయ్య రక్షణ కవచం పై గీతా కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరం వెంకటాపురం సొసైటీ అధ్యక్షులు బత్తిని నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో, హనుమకొండ జిల్లా కాటమయ్య రక్షణ కవచం కోఆర్డినేటర్ మరియు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో నిర్వహించారు.ఈ శిక్షణలో పెద్ద పెండ్యాల, ధర్మపురం, మల్లక్పల్లి, గర్నపల్లి, వెంకటాపురం గ్రామాలకు చెందిన గీతా కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, మరియు దాని అమలులో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్ర ఉప్పలయ్య, బాల్నె వెంకట మల్లయ్య, ట్రైనర్లు, అయినవోలు మండల కార్యదర్శి గట్టు కార్తీక్ గౌడ్, కాజీపేట మండల అధ్యక్షులు మోడెం రాజేందర్ గౌడ్, ఆయా గ్రామాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో గీతా కార్మికులు, అలాగే ఎక్సైజ్ ఎస్సై తిరుపతిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ శిక్షణతో గీతా కార్మికుల్లో అవగాహన పెరిగి, రక్షణతో కూడిన జీవన విధానాన్ని అనుసరించేందుకు తోడ్పడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.