గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా-సర్పంచ్ అభ్యర్థి
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారేపల్లి సురేష్ తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పూర్తి బాధ్యతగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్యల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.గ్రామంలో సీసీ రోడ్లు,డ్రైనేజీ,అంతర్గత రహదారులు తదితర అనేక మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయని,తాను గెలిస్తే వాటన్నింటినీ పరిష్కరించి అభివృద్ధి చేస్తానని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామానికి సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక నిధులతో గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.తాను విద్యావంతుడినని,గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.విద్యావంతుడైన నాయకుడిని సర్పంచ్‌గా ఎన్నుకుంటేనే గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.కావున వెంకటాపురం గ్రామ ప్రజలు తనను అధిక మెజార్టీతో గెలిపించాలని మారేపల్లి సురేష్ ప్రజలను విజ్ఞప్తి చేశారు