ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సాధన నుండి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ గారి నాయకత్వం ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.