
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనీ వివిధ గ్రామాలలో గణపయ్యకు ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు.రేగొండ పోలీసుల ముందస్తు సూచనలతో ప్రతి గ్రామంలో వినాయక నిమజ్జనాలు ఏ ఆటంకం లేకుండా జరిగాయి.ముందుగా భక్తులు స్నానాలు ఆచరించి నవరాత్రుల సందర్భంగా గణపయ్యకు ఊరూరా వేద పండితుల మధ్య ఆఖరి పూజ కార్యక్రమాలు నిర్వహించి తాము సిద్ధం చేసిన వాహనాల లో గణపయ్య విగ్రహాలను గ్రామాలలో అన్ని వీధులలో ఊరేగిస్తూ ప్రసాదం పంచిపెడుతూ పిల్లలు మహిళలు భక్తుల కోలాటాల మధ్య అంగరంగ వైభవంగా గణనాధునికి ఊరేగింపు కార్యక్రమాలను పూర్తి చేసి గణపయ్య ను గంగమ్మ ఒడికి చేర్చి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.భక్తులు,చిన్నపిల్లలు బాధ హృదయంతో వినాయకుడికి కడసారి వీడ్కోలు పలికారు.మండలంలోని కొన్ని గ్రామాలలో నిమజ్జన కార్యక్రమానికి ముందు లడ్డు వేలంపాట కార్యక్రమాలను వినాయక మండప నిర్వాహకులు నిర్వహించారు.