ఘనంగా ముగిసిన మండల బ్లాక్ లెవెల్ క్రీడలు
ములుగు జిల్లావెంకటాపూర్ మండల్ బ్లాక్ లెవెల్ క్రీడలు మేరా యువభారత్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వెంకటాపూర్ మండలం బ్లాక్ లెవెల్ క్రీడలు విజయవంతంగా ముగిసాయి ఈ క్రీడాలో బాలురు వాలీబాల్ విభాగంలో తెలంగాణ ఆదర్శ కళాశాల జవహర్ నగర్ విద్యార్థులు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ మాట్లాడుతూ నిజజీవితంలో క్రీడలు ఎంతో దోహదపడతాయని మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించడానికి, క్రీడలు తోడ్పడతాయని అన్నారు.క్రీడల్లో గెలుపోటోలు సమానంగా స్వీకరించాలి.అలా చేసినప్పుడే భవిష్యత్తులో ముందు అడుగు వేస్తారన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కుమారస్వామి మేరా యువభారత్ జిల్లా యువత కోఆర్డినేటర్ కామా రాము మరియు అధ్యాపకులు శంషోద్దీన్, వెంకయ్య, రామదాసు, అశోక్, రమేషు, ఫక్రుద్దీన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు