చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పించే వేదిక సంత
రాంపురం గ్రామం లో నూతన సంత ను ప్రారంభించిన
సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామం శివాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంత ను స్థానిక సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారానికి ఒకసారి లేదా నిర్దిష్ట రోజున జరిగే మార్కెట్. ఇది కేవలం కొనుగోలు–అమ్మకాలకు మాత్రమే కాకుండా, గ్రామాల ఆర్థిక, సామాజిక జీవితానికి ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది అన్నారు, గ్రామాల్లో సంతలు ప్రజల దైనందిన జీవితంలో భాగమై ఉన్నాయి అన్నారు,
సంతలో రైతులు తమ పంటలను నేరుగా తీసుకువచ్చి అమ్ముతారు. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు, పశువులు, కోళ్లు, గృహోపకరణాలు, దుస్తులు వంటి అనేక వస్తువులు ఇక్కడ లభిస్తాయి అన్నారు,మధ్యవర్తులు లేకుండా రైతులు వినియోగదారులతో నేరుగా వ్యాపారం చేయడం వల్ల వారికి మంచి లాభం వస్తుంది.
సంత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తుంది అన్నారు,చిన్న వ్యాపారులు, చేతివృత్తిదారులు తమ ఉత్పత్తులను ఇక్కడ అమ్మి ఉపాధి పొందగలుగుతారన్నారు. దీంతో గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా సంత ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు అందించే వేదికగా ఉంటుంది అని.సంత లో గ్రామస్తులు ఒకేచోట చేరి పరస్పరం మాట్లాడుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం, స్నేహ బంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలు సంతలో కనిపిస్తాయి అన్నారు,పండుగల సమయంలో సంత మరింత రద్దీగా మారి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది అన్నారు, ఇలాంటి నూతన కార్యక్రమాలు చేపట్టుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆకాంక్షించారు,ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ బందు యాకయ్య,వార్డు మెంబర్స్ దిద్ది సందీప్ యాదవ్, ఈరగని శ్రీలక్ష్మి రమేష్, గ్రామస్తులు రామసహాయం విష్ణువర్ధన్ రెడ్డి, పెండ్లి మహేష్ రెడ్డి,ఈరగని ఉపేందర్ గౌడ్,దిద్ది చెంద్రశేఖర్,జక్కోజు సురేష్, రాంపెల్లి రంజిత్ గౌడ్, మాడుగుల వెంకన్న, మాగుడుల సోమయ్య,కొమ్ము మహేష్, పులుగుజ్జా శ్రీనివాస్,సుధాగాని రాజలింగం, పెండ్లి వెంకన్న,బొల్లా ముత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.