
పి జయలక్ష్మి CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు..
4 లేబర్ కోడ్స్ రద్దు కోసం కదం తొక్కిన కార్మిక వర్గం.
-కార్మికులకు నష్టం కల్గించే 4 లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.
………………. పి జయలక్ష్మి CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు..
……………………… కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను యధా విధంగా కొనసాగించాలని కేంద్ర కార్మిక సంఘాలు,వ్యవసాయ ఫెడరేషన్ల పిలుపుమేరకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను.. జయప్రదం చేయడం జరిగింది.
ఈ యొక్క సార్వత్రిక సమ్మె కార్యక్రమానికి CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి జయలక్ష్మి గారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలను బడా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చివేసి కార్మిక హక్కులను కాలరాసే విధంగా చట్టాలను కోడ్లుగా మార్చి వేశారని ఆమె కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఉత్పత్తి వర్గాలుగా ఉన్నటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలను బానిసలుగా మార్చే ప్రయత్నం చేశారని, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నంలో రైతులు13 నెలల పాటు జరిగిన పోరాటంలో చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని, అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న తమ హక్కులను తిరిగి పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆమె కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
CITU జిల్లా అధ్యక్షులు దీప్లా నాయక్ .. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం AIAWU.. జిల్లా అధ్యక్షులు పోలే జగన్, AITUC జిల్లా అధ్యక్షులు బ్యాగీ కృష్ణయ్య లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లేబర్ కోట్లకు వ్యతిరేకంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఫెడరేషన్లు స్వచ్ఛంద సంస్థలు అసంఘటిత రంగ కార్మికులు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే దాంట్లో ఐక్య పోరాటాలతోనే అది సాధ్యమవుతుందని కార్మిక వర్గం హక్కుల కోసం, లేబర్ కొడ్ల రద్దు కోసం దశల వారి పోరాటాలు కొనసాగించేందుకు కార్మిక వర్గం ముందు బాటన నిలవాలని వారు.
ఈ యొక్క కార్యక్రమం చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ నుండి నేతాజీ చౌరస్తా మీదుగా సిగ్నల్ గడ్డ నుండి ఎంపీడీవో ఆఫీస్ వరకు 1000 మంది కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని నినాదాలతో ర్యాలీ సాగించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో… సభ… నిర్వహించడం జరిగింది. ఈ యొక్క.. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె.. కార్యక్రమంలో CITU AITUC, మున్సిపల్ జిల్లా నాయకులు తెలుగు సత్తయ్య, బ్యాగ్ కృష్ణయ్య, ఆకుల వెంకటేష్ సభాదక్షత వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో KVPS మండల నాయకులు శంకర్ AIAWU మండల నాయకులు ఈర్లపల్లి యాదయ్య DYFI నాయకులు మధు సమ్మెకు మద్దతుగా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడి, ఆశ, voa, గ్రామపంచాయతీ, మున్సిపల్, మధ్యాహ్న భోజనం, గ్లాస్ ఫిట్టింగ్ అసోసియేషన్, కంపెనీ కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు ప్రభావతి, సావిత్రి, రమేష్, వాసియాబేగం, సుశీల, చంద్రకళ, స్వర్ణలత, రామచంద్రమ్మ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.