
జనగామ జిల్లా నూతన కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతల స్వీకరణ – జనగామ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రిజ్వాన్ బాషా షేక్ బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న 2014 కేడర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా ను జనగామ జిల్లా నూతన కలెక్టర్గా నియమించారు.గురువారం మధ్యాహ్నం సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు.జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.