
ఈ69న్యూస్ జనగామ,జూలై 9:జనగామ జిల్లా 2025–26 సంవత్సరానికి సంబంధించి 5381.87 కోట్ల రూపాయలతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను బుధవారం కలెక్టర్ డా.రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన డిసిసి-డిఎల్ఆర్సి సమావేశంలో బ్యాంకు మేనేజర్లు,వివిధ బ్యాంకుల కంట్రోలర్లు,అధికారులతో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ అధ్యక్షత వహించారు.సమావేశంలో బ్యాంకు రుణాల అమలు,బ్యాంక్ లింకేజీతో ఉన్న ప్రభుత్వ పథకాల పురోగతి తదితర అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రాధాన్యత రంగాల అభివృద్ధి కోసం బ్యాంకులు లక్ష్యబద్ధంగా పని చేయాలి. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రైతులకు పంట రుణాలు సులభంగా మంజూరు చేయాలి అని సూచించారు.మహిళల ఆర్థిక శక్తీకరణ కోసం మహిళా స్వయం సహాయ సంఘాలకు అధిక మొత్తంలో రుణాలు ఇవ్వాలని,మత్స్యకారుల సంఘాలు,పశుపాలన,చేనేత రంగాలకు రుణాల మంజూరు పెంచాలని సూచించారు.అలాగే PM కూసుమ్,ఇందిర మహిళా శక్తి వంటి పథకాల అమలులో బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.2024–25 రుణ ప్రణాళిక పురోగతి:మొత్తం లక్ష్యం: ₹4569.48 కోట్లు,మంజూరైన మొత్తం: ₹3860.44 కోట్లు,వ్యవసాయ రంగ లక్ష్యం: ₹3477.70 కోట్లు,అందులో మంజూరు: ₹2658.67 కోట్లు,పంట రుణాల లక్ష్యం: ₹1840.07 కోట్లు,మంజూరు: ₹1538.75 కోట్లు,మహిళా సంఘాల రుణాల లక్ష్యం: ₹476.47 కోట్లు,మంజూరైన రుణాలు: ₹528.72 కోట్లు,2025–26 సంవత్సరానికి రుణ ప్రణాళిక కేటాయింపులు:మొత్తం ప్రణాళిక: ₹5381.87 కోట్లు,పంట రుణాలు: ₹2482.11 కోట్లు,మొత్తం వ్యవసాయ రుణాలు: ₹3811.67 కోట్లు,ప్రాధాన్యత రంగాలకు: ₹4535.72 కోట్లు,ఆప్రాధాన్యత రంగాలకు: ₹846.15 కోట్లు,ఈ సమావేశంలో డిఆర్డిఏ పీవో వసంత,ఎల్డిఎం మూర్తి,ఆర్బిఐ ఏజీఎం చేతన్,నాబార్డ్ ఏజీఎం,డీఈఓ రామారావు,ఇతర బ్యాంకుల ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.