
ఈ69న్యూస్ జనగామ:జఫర్గడ్ మండలానికి చెందిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని గొలుసుల అభిజ్ఞ శ్రీ బాసర త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది.పదో తరగతిలో 562 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచిన ఆమెను పాఠశాల ప్రిన్సిపల్ డా.కె.శ్రీకాంత్,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు అభినందించారు.అలాగే జఫర్గడ్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జబీన్ ఫాతిమా,తమ్మడపల్లి జి పాఠశాల నుంచి చిలువేరు మౌనశ్రీ,సముద్రాల తేజశ్విని,కూనూరు పాఠశాల విద్యార్థినులు ఈ నైతిక,డి.స్నేహ,బి.మనస్విని,హిమ్మత్‌నగర్ ZPHSకు చెందిన ఎర్ర అర్చన కూడా బాసర త్రిబుల్ ఐటీలో ప్రవేశం పొందారు.విద్యార్థుల విజయాన్నిపాఠశాలలు,ఉపాధ్యాయులు అభినందించారు.