
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో కమిషనర్ కార్యాలయం ధర్నాకు పిలుపు
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో కమిషనర్ కార్యాలయం ధర్నాకు పిలుపు
E69NEWS పాలకుర్తి, జూన్ 21
జూలై 9న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు రాపర్తి రాజు పిలుపునిచ్చారు.పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పాలకుర్తి,కొడకండ్ల మండలాల గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం శనివారం కుక్కల సోమన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాపర్తి రాజు మాట్లాడుతూ..గత రెండు నెలలుగా ఆగిపోయిన వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే చెల్లించాలని,అలాగే ఆన్లైన్లో నమోదుకాని కార్మికుల వివరాలను నమోదు చేసి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని,జీవో నెంబర్ 51ను సవరించాలని,కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని,ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని రూ.15 లక్షల వరకు పెంచాలని కోరారు.ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 27న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న చలో కమిషనర్ కార్యాలయం ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న,జిపి యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న,మండల నాయకులు పరంజ్యోతి,యాకన్న,కిష్టయ్య,యాదగిరి,ఇరుగు నరసింహ,సుశీల,లక్ష్మి,యాకమ్మ,అరుణ,మల్లమ్మ,సోమ నరసమ్మ,రవి,సోమయ్య,కుమార్ తదితరులు పాల్గొన్నారు.