టీఆర్పీ సర్పంచ్ అభ్యర్థిగా హారిక నామినేషన్
సూర్య నాయక్ తండా గ్రామం నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) తరఫున సర్పంచ్ అభ్యర్థిగా గూగులోతు హారిక జవహర్లాల్ (తీన్మార్ జై) నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు బాలినే లక్ష్మి, నాయకులు బాలినే జగన్మోహన్, సత్యనారాయణ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు.
తరువాత రవి పటేల్ మాట్లాడుతూ— కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన బీసీలకు 42% రిజర్వేషన్ హామీ తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు.
టీఆర్పీ లక్ష్యం పేదలకు విద్య, వైద్యం, సత్వర న్యాయం అందించడం, భూమిలేని కుటుంబాలకు రెండు ఎకరాలు ఇచ్చే సంకల్పం అమలు చేయడం అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం టీఆర్పీ పుట్టిందని పేర్కొన్నారు.
యువ అభ్యర్థి హారికను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, ఆమె ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తుందని రవి పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రణయ్ రాజ్, జినుకల శ్రీను, సామల చంద్రశేఖర్, ప్రణీత్ తదితర నాయకులు పాల్గొన్నారు.