
డోర్నకల్ నియోజకవర్గ స్థాయి బిజెపి సమ్మేళనం ను జయప్రదం చేయండి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక వంటి కొమ్ము లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి బిజెపి నాయకులతో,బూత్ స్థాయి నాయకులు,కార్యకర్తలతో సన్నాహాక సమ్మేళనం అలాగే ఆదివారం సెప్టెంబర్,10న కార్గిల్ స్థూపం నుండి రాజీవ్ గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్,గరికపాటి మోహన్ రావు పాల్గొని,జరుగబోయే ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేయనున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రాజు మాట్లాడుతూ ఆదివారం జరుగబోయే సన్నాహక సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని,బి అర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ పాలనపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరచాలని,అలాగే బీజేపీ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.అనంతరం డోర్నకల్ నియోజకవర్గ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఈ సారి డోర్నకల్ లో బీజేపీ పార్టీ గెలుపు బోతుందని,ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ప్రజలకు పూర్తి నమ్మకమున్నదని,ప్రధాని పరిపాలనకు ఆకర్షితులై నియోజకవర్గంలో భారీగా బీజేపీ పార్టీ కండువా కప్పూకొని బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ప్రజలను మోసపుచ్చి అధికారం అందిపుచ్చుకొని,కేసీఆర్ కుటుంబం బాంగారు కుటుంబంగా చేసుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్ పట్టణ అధ్యక్షులు లింగం,జిల్లా ఉపాధ్యక్షులు భూక్యకాంతమ్మ, డోర్నకల్ నియోజకవర్గ కన్వీనర్ పూర్ణచందర్ రెడ్డి బిజెపి నాయకులు భూక్య శీను,ఇంకా పార్టీ,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.