
డ్రంక్ అండ్ డ్రైవ్: ఇద్దరికి జైలు శిక్ష, 29 మందికి జరిమానా
ఈ69న్యూస్,:- వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 22న మద్యం సేవించి వాహనాలు నడిపిన 36 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గౌరవ న్యాయమూర్తి అబ్బోజు వేంకటేశం ఎదుట హాజరుపరచగా, ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించగా, మిగతా 29 మందికి కలిపి రూ.41,500 జరిమానా విధించారు.జైలు శిక్ష పడిన వారు చెన్నారావుపేటకు చెందిన దరాంసాత్ యోగేశ్వర్, హుస్నాబాద్‌కు చెందిన బైరి నర్సింహ. వీరిని హుజురాబాద్ ఉప జైలుకు తరలించారు.అలాగే డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు రూ.2,000 జరిమానా విధించింది.ఈ కార్యకలాపం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సంప్రీత్ సింగ్, సహాయ పోలీస్ కమిషనర్ శ్రీ టి. సత్యనారాయణ పర్యవేక్షణలో,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.