
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (టేకుమట్ల): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో అనూహ్య సంఘటన జరిగింది. తనిఖీ అంటేనే ఆకస్మికంగా వెళ్లి పరిశీలన చేస్తారు.. తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై వేటు వేస్తారు.. లేదా తప్పు చేసిన వారిని తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తారు.. కాని అవేమి చేయకుండా జిల్లా విద్యాధికారి సన్మానం చేయడంతో చల్లబడినట్లున్నారు,ముందే సమాచారం ఇచ్చారో, లేదా పాఠశాలలోనే శాలువాలు ఉన్నాయో తెలియదు కాని, ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లిన డీఈఓకు టేకుమట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం శాలువా కప్పి సపర్యలు చేశారు.. ముందస్తు ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు చేయాల్సిన డిఈఓ బుధవారం మొక్కుబడి తనిఖీల కోసం వెళ్లి శాలువాలతో సన్మానాలు చేయించుకోవడం పట్ల జిల్లాలో పెద్ద దుమారం లేస్తుంది..
అంతగా సన్మానాలు కావాలనుకుంటే ఏదైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలు, లేదా ఇంకేదైనా కార్యక్రమాలకు వెళ్లినపుడు సన్మానాలు చేయించుకోవాలి కాని, భూపాలపల్లి డీఈఓ ఆకస్మిక తనిఖీల కోసం వెళ్లి సన్మానాలతో కాలక్షేపం చేయడాన్ని జిల్లాలోని పలువురు మేధావులు తప్పు పడుతున్నారు..