తెలంగాణ ఎన్పిడిసిఎల్ సీఎండీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం
తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (తెలంగాణ ఎన్పిడిసిఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి కొడవటంచలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎండీ కి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.ఆలయానికి చేరుకున్న వరుణ్ రెడ్డి ని ఆలయ చైర్మన్ సంపత్ రావు, ఈఓ మహేష్ ఆలయ అర్చకులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతించారు.అనంతరం వేదమంత్రాల నడుమ ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా సీఎండీ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.ఆలయ ప్రాంగణంలో భక్తులతో స్వల్పంగా ముచ్చటించిన ఆయన, ప్రాంత ప్రజలకు శాంతి, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి,భక్తులకు సౌకర్యాల విస్తరణ, విద్యుత్ సరఫరా మెరుగుదల వంటి అంశాలపై స్థానిక ప్రతినిధులతో చర్చ జరిగినట్లు తెలిసింది.ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తుల రాకపోకలకు సౌలభ్యం కల్పించే ఏర్పాట్లను అధికారులు వివరించారు. ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని సీఎండీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంపత్ రావు, ఈఓ మహేష్, ఆలయ సిబ్బంది,ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తి, గౌరవ వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది