తెలంగాణ జాగృతి లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
జాగృతి సిద్ధాంతాలకు రాబోయే కొత్త పార్టీకి ఆకర్షితులై కవిత సమక్షంలో జాయిన్ అయినా మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాబురావు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ని కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. తెలంగాణ జాగృతి లోకి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు జాగృతి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చిన సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్బంగా మాట్లాడుతూ…
అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా కుటుంబంతో వారం రోజులు ఉండి హెల్త్ క్యాంపు పెట్టాను.రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారు.రాథోడ్ బాపూరావు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
జాగృతి ద్వారానే రాథోడ్ బాపూరావు బిఆర్ఎస్ లో చేరారు.తెలంగాణలో ఉన్న ఉద్యమ కారులు కొత్త పార్టీ వైపు చూస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుంది.ఉద్యమకారులు ఒక్కటి కావాలి ఏ స్పిరిట్ తో తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలి.బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని కోరుతున్నా.