
ఈ69న్యూస్ జనగామ: స్టేషన్ ఘనపూర్ మండలంలోని కోమటి గూడెం గ్రామంలో 14 సంవత్సరాలుగా నీటి సరఫరా పనులు చేస్తున్న దళిత వర్గానికి చెందిన వాటర్మెన్ గాదరి బిక్షపతిని పంచాయతీ కార్యదర్శి వ్యక్తిగత కక్షతో ఉద్యోగం నుంచి తొలగించారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.తనపై తప్పుడు ఆరోపణలు మోపి, అధికారిక నిబంధనలు లేని స్థితిలోనే తొలగించారని బిక్షపతి వాపోయారు.అంతేకాకుండా మూడు సంవత్సరాలుగా గౌరవ వేతనం సగం మాత్రమే చెల్లించారనీ,కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన హక్కుల కోసం పలుమార్లు సర్పంచ్,ఎంపీడీఓ,జిల్లా కలెక్టర్,పంచాయతీ అధికారులు,ఎమ్మెల్యే వద్ద వినతులు ఇచ్చినప్పటికీ స్పందన లేదని తెలిపారు.బిక్షపతికి న్యాయం చేయాలని గ్రామస్తులు,సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.