
దేవరుప్పుల మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
ఈ69న్యూస్:-జనగామ జిల్లా దేవరొప్పుల మండలంలోని MNR గార్డెన్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని రైతులతో చర్చించి సమస్యలకు సమాధానం చెప్పారు.ధరణి చట్టం వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు.రైతులు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని,స్థానిక స్థాయిలో భూ రికార్డులను సరిదిద్దుకోవచ్చన్నారు.భూములకు ప్రత్యేక భూదార్ సంఖ్యలు కేటాయించి భూ వివాదాలకు అడ్డుకట్ట వేయనున్నట్లు చెప్పారు.అనంతరం కలెక్టర్ సీతారాంపురం,సింగరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి,తేమ శాతం వచ్చాక ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.