
నల్లగొండలో ఘనంగా పూలే-అంబేడ్కర్ జాతర
ఈ69న్యూస్:- నల్లగొండ గడియారం చౌరస్తాలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పూలే-అంబేడ్కర్ జనజాతర బహిరంగ సభ నిర్వహించారు.సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ, “విద్యే బలమైన ఆయుధం.పోరాటాల ద్వారానే సమూలమైన మార్పులు సాధ్యం” అని అన్నారు.కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ..”మతోన్మాద శక్తులు మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి.పూలే-అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,అంబటి నాగయ్య,అనిత తదితరులు పాల్గొన్నారు.