వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ డీ.కవిత
తెలుగు గళం న్యూస్ ధర్మసాగర్,డిసెంబర్ 2
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ డీ.కవిత మంగళవారం ధర్మసాగర్ మండలంలోని దేవునూర్,ముప్పారం గ్రామాల్లో తనిఖీ చేశారు.నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన డీసీపీ,ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడం,కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.డీసీపీ కవితతో పాటు ధర్మసాగర్ సీఐ కె.శ్రీధర్ రావు,పోలీసు సిబ్బంది ఉన్నారు