నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు
ప్రముఖ నాయకులు నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ, నూకల నరేష్ రెడ్డి ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. వారి సేవలు, ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, మాజీ సర్పంచ్ పాంగోత్ రాంలాల్, జిల్లా మైనారిటీ నాయకులు ఆఫ్జల్ తదితరులు పాల్గొని నూకల నరేష్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం నాయకులు నూకల నరేష్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.