నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం
ధర్మసాగర్ మండల నూతన తహసీల్దార్ ఇస్లావత్ బావు సింగ్‌ను ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా బొడ్డు దయాకర్ మాదిగ మాట్లాడుతూ,తహసీల్దార్ రైతులు, పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో గంగారపు శ్రీనివాస్ మాదిగ, బొడ్డు శాంతి సాగర్ మాదిగ,మంద వర్ధన్ మాదిగ,పొడిషెట్టి ప్రతాప్ మాదిగ, సింగారపు పవన్ మాదిగ,కొట్టే శివ మాదిగ, బొల్లెపాక నగేష్ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.