నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డోర్నకల్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని దయతో డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజలు నూతన సంవత్సరం నందు సంతోషంగా జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని, వ్యాపార, వాణిజ్యం వ్రద్ధి చెందాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ముందుకు పోదాం అని తెలిపారు, నూతనంగా గెలిచిన సర్పంచులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, క్లాస్ 1 కాంట్రాక్టర్ రామడుగు అచ్యుతరావు, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న, అరుణ రాంబాబు, మాజీ జెడ్పిటిసి శారద రవీందర్, మాజీ సర్పంచి అజ్మీర రెడ్డి, దుస్స నరసయ్య,డాక్టర్ రవి నాయక్, గంధసిరి కృష్ణ, తానంచర్ల మాజీ సర్పంచ్ శ్వేతా ముఖేష్, ఎల్లంపేట మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రఘురాం, ఉగంపల్లి సర్పంచ్ అయూబ్ పాషా, పద్మశాలి సంఘం నాయకులు శ్రీనివాస్,మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు,పలువురు పట్టణ ప్రముఖులు, బిఆర్ స్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.