
పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన పొంగులేటి
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
తల్లాడ గళం న్యూస్
కూసుమంచి మండలంలోని మునిగేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామా శ్రీను తల్లి ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా ఈశ్వరమధారం గ్రామంలో మరో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడులో రెండు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. గుర్రాలపాడు, రెడ్డిపల్లి, ఏదులాపురంలలో జరిగిన పలు వివాహాది శుభకార్యక్రమాలు, పుట్టిన రోజు వేడుకకు హాజరై పట్టు వస్త్రాలను కానుకగా అందించారు.
ఖమ్మం నగరంలోని వాసవి గార్డెన్స్ లో, ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వీడియోస్ కాలనీలో ఇటీవల గుడవర్తి శ్రీనివాస్ తండ్రి గుడవర్తి రామారావు మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.