పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43 డివిజన్ మామునూరు బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారి సోదరిని నూతన గృహప్రవేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43 డివిజన్ మామునూరు క్యాంపు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ పోలీస్ ఆర్ ఎస్ ఐ వాసు గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు…
హనుమకొండ పిడిఆర్ గార్డెన్స్ నందు 55వ డివిజన్ పరిధిలోని సదానందం కాలనీకి చెందిన అనిల్ కుమార్తె నూతన వస్త్ర ఫలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు…
హనుమకొండ 55వ డివిజన్ పరిధిలోని డివిఆర్ గార్డెన్స్ లో 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు గార్ల కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు…
హనుమకొండ ఎర్రగట్టుగుట్ట బాలాజీ గార్డెన్స్ నందు 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ గారి కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ సరస్వతి కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు కాసగొని జనార్దన్ గౌడ్, గొడిశాల సంధ్యా గార్ల ఆహ్వానం మేరకు వారి నూతన ప్రవేశ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు….
ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, కొంక హరిబాబు, మన్నె బాబురావు, చింత ప్రకాష్, నక్క కొమురెల్లి యాదవ్, రాజ్ కుమార్, మార్క రాజు, గడ్డం అరుణ్, వరుణ్, శ్రీను, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు