పసి పాప మృతి కి కారణమైన నిందితులను కఠినంగా శిక్షిoచాలి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల చిన్నారి చనిపోవడానికి కారణం అయిన నిందితులపై చట్టం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు,మల్లెల.నాగమణి, కెవీపీఎస్ జిల్లా నాయకులు చింత ఎల్లయ్య లు కోరారు.నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన లో పసి పాపను కాలితో తన్ని చంపినా అగ్రకుల పెత్తందార్ల లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం, కెవిపిఎస్ కమీటిల ఆధ్వర్యంలో పినిరెడ్డిగూడెంలో గ్రామం కు వచ్చిన తాసిల్దార్ శారద, సర్పంచ్ కేలోత్ వీరన్న లకు గ్రామస్థులతో కలిసి శనివారం వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దాడి చేసిన హంతకులపై హత్యానేరం నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందించిన వారిలో వార్డు సభ్యురాలు బి. ఝాన్సీ, నాయకులు, గ్రామస్తులు వి. వీరభద్రం,బి. నరేష్,యం. కొండయ్య, డి. శ్రీనివాస్, డి. అలివేలు, డి లక్ష్మి,డి. భాగ్యమ్మ,నాగమణి, సర్వయ్య,సాయిలు,ఉపేందర్, మంగమ్మ, ఆరోగ్యం తదితరులు ఉన్నారు.